: మస్తాన్ బాబుకు వెంకయ్యనాయుడు సంతాపం... ప్రత్యేక విమానంలో మృతదేహం తరలింపు


ఆండీస్ పర్వతశ్రేణుల్లో అసువులు బాసిన మల్లి మస్తాన్ బాబుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. అతని మృతదేహాన్ని విమానంలో నెల్లూరుకు తరలించాలని విదేశాంగ మంత్రి సుష్మాస్వారాజ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక విమానంలో అతడి దేహాన్ని చైన్నైకు తరలిస్తున్నామని సుష్మ చెప్పారు. అక్కడి నుంచి మస్తాన్ బాబు మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని నెల్లూరు అధికారులను వెంకయ్య ఆదేశించారు. అటు ఈ విషయాన్ని అతని కుటుంబానికి మంత్రి స్వయంగా చెప్పారు.

  • Loading...

More Telugu News