: అద్వానీ మరోసారి అలిగారు!


బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ మరోసారి అలకపాన్పు ఎక్కారు. బెంగళూరులో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడంతో చిన్నబుచ్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాలన్న పార్టీ నేతల అభ్యర్థనను ఆయన తోసిపుచ్చారు. దీంతో ఆయన కేవలం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మాత్రమే పరిమితమయ్యారు. దీనిపై పార్టీలో ఆయన మద్దతు వర్గం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, లోక్ సభ ఎన్నికల్లో మోదీని ప్రధానిగా ప్రకటించినప్పటి నుంచి వారి మధ్య అంతరం పెరిగినట్టు తెలుస్తోంది. ఆయనకు తగినంత ప్రాధాన్యతనీయకపోవడంతో ఆయన ప్రసంగానికి దూరంగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News