: ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ గల్లా జయదేవ్
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికకావడం విశేషం. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ, ఏపీని క్రీడలకు రాజధానిగా మారుస్తామని ప్రకటించారు. పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహిస్తామని తెలిపారు.