: ముఖ్యమంత్రులకు ప్రధాని ఇంట నేడు విందు... హాజరుకానున్న చంద్రబాబు!


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో నేటి రాత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విందు ఇవ్వనున్నారు. ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా కొలువుదీరిన 'నీతి ఆయోగ్'లో స్థానమివ్వడం ద్వారా ముఖ్యమంత్రులకు కేంద్ర విధాన నిర్ణయాల్లో మరింత మేర ప్రాధాన్యం ఇచ్చిన నరేంద్ర మోదీ, తాజాగా విందు రాజకీయాలకు తెర తీశారు. ఈ విందుకు హాజరుకావాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు కీలక అంశాలను మోదీ ముందుంచనున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు.

  • Loading...

More Telugu News