: గాంధీ ఆసుపత్రిలో దారుణం


వైద్యోనారాయణా హరీ అన్నారు పెద్దలు. కానీ నేటి వైద్యులు కొన్ని సందర్భాల్లో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాదు నడిబొడ్డున ఉన్న గాంధీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఎయిడ్స్ తో బాధపడుతూ, చివరి క్షణాల్లో కొట్టుమిట్టాడుతున్న రోగిని ఆసుపత్రి వైద్యులు బయటికి గెంటేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆ రోగి ఆసుపత్రి ప్రాంగణంలో కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనిపై అతని బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో కూడా ప్రజలకు స్థానం లేకపోతే ఎక్కడికి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News