: తాళికట్టిన వెంటనే చెన్నయ్ కి... రైనా హనీమూన్ ఐపీఎల్ తర్వాతే!


కొత్త పెళ్లి కొడుకు సురేష్ రైనా ఐపీఎల్ కు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు సాయంత్రం వివాహమాడనున్న రైనా, పెళ్లికి కొద్దిసేపటికి ముందు మిత్రులతో కలిసి వివాహ వేదికకు చేరుకోనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కి ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న రైనా, చెన్నైలో నేడు జరిగిన శిక్షణ శిబిరానికి హాజరయ్యాడు. వివాహ సమయానికి కాసేపు ముందు ఢిల్లీలోని వివాహం జరిగే లీలా ప్యాలెస్ హోటల్ కు రైనా చేరుకుంటాడు. అనంతరం, చెన్నై వెళ్లే అవకాశాలున్నాయి. ఈ నెల 9న ఐపీఎల్ లో తొలిమ్యాచ్ ఆడనున్న రైనా, ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాతే వివాహవేడుకలో భాగంగా జరగాల్సిన తంతును పూర్తి చేయనున్నాడు. రైనా వివాహానికి కెప్టెన్ ధోనీ, ధావన్, కోహ్లీ, ఆర్పీసింగ్, ప్రవీణ్ కుమార్ తదితర సహచరులు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News