: చంద్రబాబుకు పదవీగండం ఉందట!


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతకరీత్యా చెడు ఫలితాలు సూచిస్తున్నాయని విజయవాడ దుర్గాపురానికి చెందిన జ్యోతిష్కుడు పులిపాక చంద్రశేఖర సిద్ధాంతి చెప్పారు. ఈ మేరకు ఓ మీడియా తన కథనంలో పేర్కొంది. బాబు జాతక రీత్యా చెడు సంభవిస్తుందని, పదవీగండం కూడా ఉందని సిద్ధాంతి చెప్పినట్టు వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రారంభమయ్యే చంద్రగ్రహణం రాత్రి 7.14 గంటలకు ముగుస్తుందని... ఈ గ్రహణ ప్రభావం హస్త నక్షత్రం, కన్య రాశి వారిపై ఉంటుందని తెలిపారు. ఈ గ్రహణ ప్రభావం 6 నెలల పాటు ఉంటుందని, దీని చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని సిద్ధాంతి చెప్పారు.

  • Loading...

More Telugu News