: శేషాచలం అడవుల్లో కార్చిచ్చు... కరకంబాడి వైపు వేగంగా వ్యాపిస్తున్న మంటలు
శ్రీనివాసుడు కొలువై ఉన్న శేషాచలం అడవులను కార్చిచ్చు ముప్పు వదలట్లేదు. ఏటా అడవుల్లో రేగుతున్న కార్చిచ్చు వందల ఎకరాల మేర పచ్చదనాన్ని బుగ్గి చేస్తోంది. తాజాగా కొద్దిసేపటి క్రితం చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని అడవుల్లో కార్చిచ్చు చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన మంటలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. తిరుపతి సమీపంలోని కరకంబాడి వైపు మంటలు దూసుకొస్తున్నాయి. దీంతో భయాందోళనలకు గురైన కరకంబాడి వాసులు ఇళ్లను వదిలి పరుగులు పెడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగింది.