: నెల్లూరు జిల్లాలో భారీ చోరీ... రూ.50 లక్షల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు


నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొద్దిసేపటి క్రితం భారీ చోరీ జరిగింది. పట్టణంలోని ఢిల్లీ బిగ్ బజార్ సమీపంలోని జ్యువెలర్స్ షాపును తెరుస్తుండగా, ఉన్నపళంగా విరుచుకుపడిన దొంగలు రూ.50 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను అపహరించుకుని వెళ్లారు. షాపు తెరుస్తున్న వ్యక్తిని ఏమార్చిన దొంగలు క్షణాల్లో ఆభరణాలతో మాయమయ్యారు. దీంతో జ్యువెలర్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలిని పరిశీలిస్తున్నారు. నిందితులకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News