: తిరుమలలో పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయీ... చంద్రబాబుతో కలిసి శ్రీవారికి పూజలు


పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయీ చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారు. నేటి తెల్లవారుజామున తిరుమలలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆమె సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ సిటీలో ఏర్పాటవుతున్న పెప్సీకో ప్లాంట్ విస్తరణపై పరిశీలన నిమిత్తం చిత్తూరు జిల్లాకు వచ్చిన ఆమె మరికాసేపట్లో సత్యవేడు మండలంలోని ప్లాంట్ ను సందర్శిస్తారు. ఇప్పటికే శ్రీసిటీలోని ప్లాంట్ కోసం రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టిన పెప్సీకో, ప్లాంట్ విస్తరణ కోసం దాదాపు రూ.18,000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది.

  • Loading...

More Telugu News