: గిరిరాజ్ కు గాజులు తొడిగి, బొట్టు పెట్టి ఊరేగించాలి: లాలూ
కేంద్ర మంత్రి గిరిరాజ్ పై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీ శరీర రంగుపై వ్యాఖ్యానించిన గిరిరాజ్ ముఖానికి నల్ల రంగు పూసి, గాజులు తొడిగి, బొట్టు పెట్టి ఊరేగించాలని అన్నారు. గిరిరాజ్ లాంటి వాళ్లకు మహిళలు రాజకీయాల్లో ఉండడం ఇష్టం లేదని పేర్కొన్నారు. నల్లగా ఉండే మహిళలపై వ్యాఖ్యలు చేసిన శరద్ యాదవ్ క్షమాపణలు కోరలేదా? అని ప్రశ్నించిన ఆయన, ఇలాంటి వారిని మీడియాలో ఎందుకు చూపిస్తారని అడిగారు. రాజకీయాల్లో విలువలు పడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా కూడా ఇలాంటి విషయాలమీదే ఆసక్తి చూపుతోందని విమర్శించారు.