: కేంద్రం ఇంతలా అవమానిస్తుందా?: గుత్తా జ్వాల


క్రీడామంత్రిత్వ శాఖ తీరుపై భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆగ్రహం వ్యక్తం చేసింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో డబుల్స్ క్రీడాకారిణుల పేర్లను పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలం దేశానికి సేవ చేసిన తరువాత కేంద్రం తమను అవమానించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ తమకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉందని భావించామని, తాజా నిర్ణయంతో తమపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలిసిందని ఆమె పేర్కొంది. కార్పొరేట్ వర్గాల మద్దతు ఉన్న క్రీడాకారుల పేర్లే 'టాప్' పథకంలో చోటుచేసుకున్నాయని ఆమె వెల్లడించింది. తనను, అశ్విని పొన్నప్పను క్రీడల మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదని ఆమె తెలిపింది. డబుల్స్ లో ఆడేందుకు తాము చాలా కష్టపడ్డామని, 'బాయ్' తీరుతో తాము అలసిపోయామని, ఇలా చేస్తారని ఊహించలేదని, ఇప్పుడేం చేయాలో కూడా అర్థంకావడం లేదని జ్వాల పేర్కొంది.

  • Loading...

More Telugu News