: యెమెన్ లో ప్రవేశించిన విదేశీ సేనలు, వెర్రెత్తిపోతున్న తిరుగుబాటుదారులు
మద్యప్రాచ్య దేశమైన యెమెన్ లోకి విదేశీ సేనలు ప్రవేశించాయి. గత కొంత కాలంగా యెమెన్ లో అంతర్యుద్ధం చోటుచేసుకుంది. దీంతో తిరుగుబాటుదారులు యెమెన్ లోని వివిధ పట్టణాలను స్వాధీనం చేసుకుంటూ ఆ దేశ పాలకులకు సవాలు విసురుతున్నారు. యెమెన్ అధ్యక్షుడు హదీ అభ్యర్థనతో రంగంలోకి దిగిన సంకీర్ణ సేనలు, అక్కడి తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. యెమెన్ దక్షిణ భాగమైన ఏడెన్ సిటీలో విదేశీ దళాలు ప్రవేశించడంతో తిరుగుబాటుదారులు, ప్రభుత్వ దళాల మధ్య పోరు తీవ్రం కానుంది. కాగా, ఏడెన్ లో అధ్యక్షుడికి పట్టు ఉండడం సంకీర్ణ సేనలకు కలిసివచ్చే అంశం కాగా, నిన్న సంకీర్ణ సేనలు తిరుగుబాటుదారుల ఆయుధ నిల్వలు, స్థావరాలపై వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే.