: రాహుల్ గాంధీ త్వరలోనే తిరిగొస్తారు: సోనియా గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, తన కుమారుడు రాహుల్ గాంధీ త్వరలోనే సెలవు నుంచి తిరిగి వస్తారని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారు. మధ్యప్రదేశ్ లోని నీముచ్ లో అకాలవర్షాలతో పంటనష్టపోయిన రైతులను సోనియా ఈ రోజు పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, "రాహుల్ త్వరలోనే తిరిగొస్తారు" అని తెలిపారు. ఇదిలా ఉంటే, కొన్ని రోజుల నుంచి జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాహుల్ ను ఇటీవల అదృశ్యమైన మలేషియన్ విమానంతో పోల్చి బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ అపహాస్యం చేసిన సంగతి తెలిసిందే.