: పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇస్లామాబాద్ లోని జిల్లా కోర్టు ఆయనకు ఈ వారెంట్ ను జారీ చేయడంతో పాటు తక్షణమే ముషారఫ్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. లాల్ మసీదు ప్రధాన గురువు అబ్దుల్ రషీద్ ఘాజీ, అతడి తల్లి హత్య కేసులో ముషారఫ్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణకు 2007 నుంచి ముషారఫ్ హాజరు కావడంలేదట. దీంతో, ఆయనను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపునివ్వాలన్న ముషారఫ్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు, ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News