: ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు పన్నులు చెల్లించమనడం సరికాదు: మంత్రి శిద్దా
ఏపీ, తెలంగాణకు ఒకే రాజధాని పదేళ్లు ఉమ్మడిగా ఉన్నప్పుడు పన్నులు చెల్లించమనడం సరికాదని ఏపీ రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పన్ను విధింపుపై గవర్నర్ తో చర్చించానని చెప్పారు. దానిపై తెలంగాణ ప్రభుత్వంతో గవర్నర్ మాట్లాడి నిర్ణయం చెబుతానన్నారని తెలిపారు. రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలకు ఇబ్బంది కలిగేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే కేంద్రం దృష్టికి వెళతామని శిద్దా స్పష్టం చేశారు.