: ఖేమ్కా బదిలీ ఎఫెక్ట్... ఖట్టర్ కేబినెట్ లో విభేదాలు!


నిజాయతీ అధికారిగానే కాక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూదాహాన్ని వెలికితీసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బదిలీ హర్యానాలో కలకలం రేపుతోంది. తన సర్వీసులో ఇప్పటికే 45 సార్లు బదిలీ అయిన ఆయనను 46వ బదిలీ కింద పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ గా హర్యానా ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన ఈ బదిలీని ఆయన కేబినెట్ లోని కీలక మంత్రి అనిల్ విజ్ తప్పుబట్టారు. నిజాయతీ గల అధికారిగా పేరు తెచ్చుకున్న ఖేమ్కా బదిలీ సరికాదని వ్యాఖ్యానించిన అనిల్ విజ్, ఈ విషయంపై సీఎంతో చర్చించి, బదిలీని రద్దు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News