: సూర్యాపేటలో తెలంగాణ పోలీసు బాసు... బస్ స్టేషన్ ను పరిశీలిస్తున్న అనురాగ్ శర్మ


నల్గొండ జిల్లా సూర్యాపేటలో రాత్రి దోపిడీ దొంగలు జరిపిన దాడి తెలంగాణ పోలీసు బాసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఘటన జరిగిన మరుక్షణమే జిల్లా ఎస్పీ ప్రభాకరరావు సూర్యాపేట చేరుకోగా, తెల్లవారుజామునే డీఐజీ గంగాధర్, హైదరాబాదు రేంజీ ఐజీ నవీన్ చంద్ లు సూర్యాపేట చేరుకున్నారు. ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన వారు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, కొద్దిసేపటి క్రితం తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా సూర్యాపేట చేరుకున్నారు. ఘటన జరిగిన హైటెక్ బస్టాండ్ లో ఆయన అణువణువునూ పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News