: వంద రూపాయల కోసం హత్య... ఆగ్రాలో దారుణం
వంద రూపాయల కోసం హత్య చేసిన ఘటన ఆగ్రాలో ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఎంఎల్ ఉపాధ్యాయ మనవడు జైకిషన్ స్థానిక దేవాలయంలో పని చేయించాడు. ఆ దేవాలయంలో పని చేసిన పప్పూ అనే కూలీ తనకు రావాల్సిన వంద రూపాయల కోసం జైకిషన్ ను నిలదీశాడు. దీంతో, కోపోద్రిక్తుడైన జైకిషన్ పప్పూను నేలపై పడేసి అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో, పప్పూ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. విషయం తెలిసిన బాధితుడి కుటుంబ సభ్యులు, దళితులు పెద్ద సంఖ్యలో చేరుకుని మేజర్ ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. ఆస్తులు ధ్వంసం చేశారు. అడ్డుకున్న మేజర్ పై దాడిచేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించి చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన మేజర్ ఉపాధ్యాయను సరోజినీ నాయుడు మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, జైకిషన్ కోసం గాలిస్తున్నారు.