: వైఎస్ జగన్ ఢిల్లీ వెళితే మీకెందుకు భయం?: టీడీపీ నేతలపై రోజా ఫైర్
టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేత జగన్ ఏం చేసినా, టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఢిల్లీ వెళితే మీకెందుకు భయం? అని ప్రశ్నించారు. కేంద్రంలోని పెద్దలను జగన్ కలిస్తే పట్టిసీమ బండారం వెల్లడవుతుందని టీడీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పట్టిసీమ రాయలసీమకు మేలు చేకూర్చేది కాదని... చంద్రబాబు, లోకేశ్ లకు ఉపయోగపడేదని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక, యనమల రామకృష్ణుడు ఎలా మంత్రి అయ్యారో అందరికీ తెలుసన్నారు. అలాంటి వ్యక్తి జగన్ ను విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అయినా, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ప్రజల సమస్యలపై ప్రధాని మోదీని కలవడం తప్పా? అని రోజా అడిగారు.