: తెల్ల తోలు మహిళ.... సోనియాపై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్య
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర జాత్యహంకార, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ తెల్లచర్మం మహిళ (సోనియా)ను కాకుండా ఓ నైజీరియన్ మహిళను పెళ్లి చేసుకునుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. సోనియా తెల్లరంగు చర్మం మహిళ కాబట్టే కాంగ్రెస్ ఆమె నాయకత్వాన్ని అంగీకరించిందని ఓ ప్రెస్ మీట్ లో అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బీహార్ నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన సింగ్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారన్న చరిత్ర కలిగి ఉన్నప్పటికీ కేంద్రంలో మంత్రయ్యారు. కాగా, గతేడాది లోక్ సభ ఎన్నికల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించినప్పుడు కూడా గిరిరాజ్ విమర్శకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.