: ఆప్ అధికార ప్రతినిధి హోదా నుంచి ప్రశాంత్ భూషణ్, యాదవ్ తొలగింపు
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లపై పార్టీలోని ఒక్కో పదవి నుంచి వేటు పడుతోంది. తాజాగా పార్టీ అధికార ప్రతినిధి హోదా నుంచి వారిద్దరినీ తొలగిస్తూ గతరాత్రి ఆలస్యంగా ఆప్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భూషణ్, యాదవ్ లను ముఖ్య ప్యానెల్స్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. వారితోపాటు మరో ముగ్గురిని కూడా అధికార ప్రతినిధి హోదా నుంచి తొలగించింది. దాంతో సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్, పంకజ్ గుప్తా, ఇలియాస్ అజ్మీ, అశుతోష్, ఆశిష్ ఖేతన్, పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ప్రస్తుతం 20 మంది పార్టీ అధికార ప్రతినిధుల జాబితాలో ఉన్నారు.