: రైతులు అడిగితేనే జేసీ దివాకర్ రెడ్డి వెళ్లారు: జేసీ ప్రభాకర్ రెడ్డి


తాగునీటి కోసం రెండు (అనంతపురం, కడప) జిల్లాల రైతులు అడిగితేనే జేసీ దివాకర్ రెడ్డి పులివెందుల బ్రాంచ్ కెనాల్ వద్దకు వెళ్లారని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. చిత్రావతిలోకి నీళ్లు వదలడం ద్వారా పల్లెజనం దప్పిక తీరిందన్నారు. పులివెందులకు 5 టీఎంసీల నీళ్లు కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడేందుకు సిద్ధమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో రవాణా రంగం కుదేలైపోతుందని, ఈ విషయంపై హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News