: యూజీసీని రద్దు చేయడమే మంచిది.... కేంద్రానికి హరి గౌతం కమిటీ సిఫారసు


యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్... సంక్షిప్తంగా యూజీసీ. దేశంలోని ఉన్నత విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలపై పర్యవేక్షణతో పాటు నిధుల విడుదల, పాఠ్య ప్రణాళికలపై కీలక సలహాలు, సూచనలు చేసే గురుతర బాధ్యత కలిగిన చట్టబద్ధ సంస్థ. అయితే దీనిని రద్దు చేయడం మినహా గత్యంతరం లేదట. ఎందుకంటే, నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడంలో ఈ సంస్థ ఘోరంగా విఫలమైందట. విద్యాలయాల నిర్వహణను యూజీసీ గాలికొదిలేసిందట. కేవలం నిధుల విడుదలకు మాత్రమే పరిమితమైందట. ఈ సంస్థకు గతంలో చైర్మన్ గా పనిచేసిన హరి గౌతం నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. యూజీసీతో ఎలాంటి ప్రయోజనం లేకపోగా, అనవసర ఖర్చులు తడిసిమోపెడతువున్నాయని గౌతం కమిటీ తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రెండు భారీ సంపుటాల్లో సమగ్ర నివేదికను సమర్పించింది. దేశంలోని ఉన్నత విద్యాలయాల పర్యవేక్షణ కోసం ‘నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అథారిటీ’ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించిన ఈ కమిటీ నివేదిక పట్ల కేంద్రం కూడా సానుకూలంగానే ఉందట.

  • Loading...

More Telugu News