: భాగ్యనగరిలో మల్టీ మిలియనీర్ల సంఖ్య పెరిగిపోతోంది!
మల్టీ మిలియనీర్ల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న ప్రపంచ నగరాల ‘టాప్ 20 జాబితా’లో హైదరాబాదుకూ చోటు దక్కింది. పదేళ్ల కిందట నగరంలో 160 మంది మల్టీ మిలియనీర్లు ఉంటే, గతేడాదికి వీరి సంఖ్య 510కి చేరింది. అంటే, కేవలం పదేళ్ల కాలంలోనే ఈ సంఖ్య మూడింతలకు పైగా పెరిగిందన్న మాట. రూ.62.5 కోట్ల ఆస్తులున్న వారిని మల్టీ మిలియనీర్లుగా పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలో ఆస్తులు కూడబెట్టి మల్టీ మిలియనీర్లుగా అవతరిస్తున్న హైదరాబాదీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ విషయంలో భారతీయ నగరాల్లో నిన్నటివరకు పుణే తొలి స్థానంలో వుండేది. అయితే పుణే కంటే కూడా ఎక్కువ మంది మల్టీ మిలియనీర్లు ఉన్న నగరంగా హైదరాబాద్ ఖ్యాతిగాంచినట్లు ‘న్యూ వరల్డ్ వెల్త్ ఆర్గనైజేషన్’ నిన్న ప్రకటించింది. పుణేలో 317 మంది మల్టీ మిలియనీర్లుంటే, ఈ సంఖ్య హైదరాబాదులో 510. ఇక ప్రపంచ నగరాల జాబితాలో వియత్నాంలోని హోచిమిన్ సిటీ అగ్రస్థానంలో నిలిచింది.