: విశాఖ అభివృద్ధిపై బీజేపీ నేత మెట్టవేదాంతం!


విశాఖ అభివృద్ధిపై ఓ బీజేపీ నేత మెట్టవేదాంతం చెప్పాడు. విచిత్రమైన ఆయన లాజిక్ ను చూసి టీవీ యాంకర్ ఆశ్చర్యపోయాడంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడానికి గల కారణం ఏంటి? అనే దానిపై ఓ టీవీ ఛానెల్ చర్చ చేపట్టింది. ఆర్ధిక సంవత్సరం ముగిసినా బీజేపీ ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెప్పిన ఆ పార్టీ నేత సుధీష్ రాంబొట్ల, కేవలం ఏపీలో ఎంత ఆర్థికలోటు ఉందనేది స్పష్టంగా తేలని కారణంగానే కేంద్రం నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలేవీ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిది విద్యాసంస్థలను బీజేపీ కేటాయించిందని అన్నారు. దీనికి యాంకర్, విద్యాసంస్థల వల్ల రాష్ట్ర ప్రజల జీవన విధానాలు ఎలా మారుతాయని ఆయనను ప్రశ్నించారు. విద్యాసంస్థలు ఉంటే పరిశ్రమలు వస్తాయని ఆయన చెప్పారు. కేవలం ఐఐటీ లేని కారణంగానే విశాఖపట్టణం అభివృద్ధి చెందలేదని సుధీష్ కొత్త సిద్ధాంతం చెప్పారు. విశాఖలో అవసరమైన విద్యార్థులు లేకపోవడంతో ఐటీ రంగం నిలదొక్కుకోలేదని ఆయన అన్నారు. దీంతో షాక్ తిన్న యాంకర్, ఐఐటీ ఉంటే కంపెనీలు వస్తాయని తానెప్పుడూ వినలేదని అన్నారు. ఐఐటీల్లో కేవలం రాష్ట్ర ప్రజలే చదవరని, దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు చదువుతారన్న విషయాన్ని యాంకర్ ఆయనకు గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News