: ఈ రోజు చూస్తాం... రేపు నిర్ణయిస్తాం: శిద్దా రాఘవరావు


తెలంగాణ ప్రభుత్వంలా తాము తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని ఏపీ రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. నేటి అర్థరాత్రి నుంచి తెలంగాణలో అంతర్రాష్ట్ర పన్నుల విధానం అమలులోకి రానుండడంపై ఆయన మాట్లాడుతూ, నేడు పరిస్థితిని గమనిస్తామని అన్నారు. రేపు నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రేపు సీఎంతో అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారులు కలిసి దీనిపై ఏకాభిప్రాయానికి రావాలని ఓపికగా ఎదురు చూశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలుపై అత్యుత్సాహం ప్రదర్శించిందని శిద్దా అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ విభజన పనుల్లో తాము బిజీగా ఉన్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News