: గుంటూరులో స్వల్ప భూకంపం... పరుగులు తీసిన ప్రజలు


గుంటూరులోని శ్యామలాపురం ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. హఠాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందోనన్న భయంతో స్థానికులు ఇళ్లను వీడి బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు వచ్చాయి. కాగా, గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాలతో పాటు, కొన్ని ఇతర ప్రాంతాలు కూడా ప్రమాదకర భూకంపాల జోన్లో ఉన్నాయని భూగర్భ శాస్త్ర నిపుణులు ఇంతకుముందే చెప్పారు. ఏపీ రాజధాని ప్రాంతం కూడా ఇదే జోన్లో ఉన్నట్టు వారు వివరించారు. ఈ విషయాన్ని వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కూడా తెలిపారట.

  • Loading...

More Telugu News