: వైఎస్ వివేకానంద రెడ్డి అరెస్ట్... జేసీ చర్యను ప్రశ్నించిన ఫలితం!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పినతండ్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు గండి కొట్టించిన అనంత ఎంపీ జేసీ దివాకరరెడ్డి చర్యను ప్రతిఘటించబోయిన వైఎస్ వివేకాను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ విప్ యామినీ బాలతో కలిసి జేసీ దివాకరరెడ్డి నిన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు గండి కొట్టిన సంగతి తెలిసిందే. జేసీ కొట్టించిన గండితో పులివెందుల ప్రజల గొంతెండటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ వివేకా పులివెందుల రైతులతో కలిసి జేసీ గండి కొట్టిన ప్రాంతానికి బయలుదేరారు. జేసీ చర్యను నిరసిస్తూ గండికొట్టిన ప్రాంతం వద్ద నిరసనకు దిగాలని ఆయన భావించారు. అయితే గండికొట్టిన ప్రాంతం వద్ద అనంత రైతులు కాపలాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల రైతుల మధ్య ఘర్షణ జరిగే ప్రమాదముందని భావించిన పోలీసులు వైఎస్ వివేకాను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News