: కలెక్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలి... కడప వైకాపా ఎమ్మెల్యేల డిమాండ్


కడప జిల్లా కలెక్టర్ పై ఆ జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు జరుగుతున్న జిల్లా పరిషత్ సమావేశానికి కలెక్టర్ హాజరుకాకపోవడంపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కడపలోనే ఉన్న కలెక్టర్ ఈ సమావేశానికి ఎందుకు రాలేదని ఉన్నతాధికారులను నిలదీశారు. అంతేకాకుండా, పారిశ్రామికవేత్తలు కడప రావాలంటే భయపడుతున్నారని జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై కూడా తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ వ్యాఖ్యలు జిల్లా వాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని... దీనికి సంబంధించి ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు తమ పార్టీకి చెందిన నేతలను అడుగడుగునా అవమానిస్తున్నారని వాపోయారు.

  • Loading...

More Telugu News