: కోదండరామ్ హెచ్చరికలు కేసీఆర్ ను ఉద్దేశించి చేసినవేనా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సైలెంట్ అయిపోయిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తన గళం విప్పారు. ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయినా, ఇంతవరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ఆరంభం కాలేదని కోదండరామ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని రకాలుగా బాగుపడతామనే ఆశతోనే ప్రజలు ఉద్యమం చేశారని... పాలించే వారు ప్రజల బాగోగులను విస్మరిస్తే... మళ్లీ ఉద్యమాలు పుట్టుకురావడం ఖాయమని హెచ్చరించారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించే కోదండరామ్ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.