: ఏపీ నుంచి వచ్చే వాహనాలకు పన్ను: తెలంగాణ సర్కారు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణలో అడుగుపెట్టే వాహనాల నుంచి పన్ను వసూలు చేయాలని, ఏపీకి చెందిన వాహనాలన్నింటినీ ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలుగానే పరిగణించాలని పేర్కొంటూ అధికారులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహనాల పన్ను చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాహనాలు పన్నులు చెల్లించాల్సిందే. గతేడాదే ఆదేశాలు జారీ చేసినప్పటికీ గవర్నర్ జోక్యంతో ఏడాదిపాటు పన్ను వసూలు చేయకూడదని నిర్ణయించారు.