: హైదరాబాదులో మారిన వాతావరణం... పలు చోట్ల వర్షాలు
గత కొద్ది రోజులుగా ఎండ వేడిమికి విలవిల్లాడిన జంటనగరాల ప్రజలు కాస్త ఊరట పొందారు. హైదరాబాద్, సికింద్రాబాదుల్లో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. దీంతో, వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బంజారాహిల్స్, అమీర్ పేట, సోమాజిగూడ, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కోఠి, రాంనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో, వాహనదారులు ఇబ్బందికి గురయ్యారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.