: ‘అమ్మ’ సీఎం కావాలని తమిళ తంబిల మహా గజ పూజ యాగం!


అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి బెయిలు మీద ఉన్న తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను తమిళ తంబిలు మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారట. అనుకోవడమేంటి?, ఈ విషయంలో సాయం చేయమని వారు దేవుడినే ప్రార్థిస్తున్నారు. జయలలిత మరోమారు సీఎం పీఠంపై ఆసీనులు కావాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ యాగాలు చేస్తున్నారు. నేటి ఉదయం కోయంబత్తూరులో దాదాపు రెండు గంటల పాటు మహా గజ పూజ యాగాన్ని నిర్వహించారు. ఈ పూజ కోసం వారు పాలక్కాడ్ నుంచి ఏకంగా ఐదు ఏనుగులను కూడా తెప్పించారు. ఏనుగుల సాక్షిగా జరిగిన ఈ యాగంలో తమిళనాడు పురపాలక శాఖ మంత్రి వేలుమణి, నగర మేయర్ రాజ్ కుమార్ లతో పాటు అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాలుపంచుకున్నారట. మరి వారి కల నెరవేరుతుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News