: 'మా' ఎన్నికలు... చిరంజీవి, దాసరిల మధ్య పరోక్ష యుద్ధమా?


హోరాహోరీగా జరిగిన 'మా' ఎన్నికలు తెలుగు సినీ ఇండస్ట్రీలోని రెండు వర్గాల మధ్య జరిగిన పరోక్ష పోరని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ పోరులో సహజనటి జయసుధ, నటుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్ష పదవికి పోటీ పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ముందు నిలిచిన వారేనని, వీరి వెనుక మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావులు ఉన్నారని సమాచారం. రాజేంద్రప్రసాద్ పోటీలో దిగాక చిరంజీవి ప్రోద్బలంతోనే నాగబాబు మద్దతు తెలిపారని నిర్ణయించుకున్న దాసరి, తన పలుకుబడితో మురళీ మోహన్ ద్వారా జయసుధను రంగంలోకి దించారని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ ను జయసుధ ఓడిస్తుందని మురళీ మోహన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయమై దాసరి ఇంకా స్పందించలేదు. కాగా, మా ఎన్నికలు ముగిసినప్పటికీ, కోర్టు తీర్పు వెలువడిన అనంతరమే ఫలితాలు బయటకు వస్తాయన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News