: పోలీసులతో తలపడ్డ దొంగలు... 11 మంది మృతి


బ్యాంకుల్లో దోపిడీలకు పాల్పడే దుండగులు, మత్తుపదార్థాలు రవాణా చేసే ముఠా సభ్యులు పోలీసులతో తలపడగా, మొత్తం 11 మంది మృతి చెందారు. ఈ ఘటన బ్రెజిల్, ఉత్తర రియో గ్రండే పరిధిలోని కురాయిస్ నావోస్ లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కొన్ని కార్లలో వస్తుండటం చూసి పోలీసులు వారిని తనిఖీ చేశారు. కార్లలో మత్తుపదార్థాలతో పాటు భారీగా ఆయుధాలు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, దొంగల ముఠా, డ్రగ్స్ స్మగ్లర్లు ఏకమై కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు సైతం ఎదురు కాల్పులు జరిపారు. మరణించిన 11 మందిలో ఏడుగురు బ్యాంకు దొంగలని, మిగతా నలుగురు మత్తుపదార్థాల రవాణా డీలర్లని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News