: అది దురదృష్టమే... కోహ్లిని వెనకేసుకొచ్చిన ద్రావిడ్
వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లి తొందరగా అవుట్ కావడం కేవలం దురదృష్టమేనని, ఇందులో అతని తప్పేమీ లేదని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ వెనకేసుకొచ్చాడు. ఒక్క మ్యాచ్ లో పరుగులు సాధించలేకపోతే విమర్శించడం సమంజసం కాదని, అంతకుముందు ఆస్ట్రేలియాపై మంచి గణాంకాలు కోహ్లి నమోదు చేశాడని రాహుల్ గుర్తు చేశాడు. కీలకమైన సెమీస్ లో రాణించలేకపోవడం కోహ్లి దురదృష్టమని, ఇటువంటివి ఆటలో సహజమని అన్నారు. వరల్డ్ కప్ లో బలమైన జట్లే ఫైనల్ కు వెళ్లాయని అన్నారు. సెమీస్ వరకు టీమిండియా ఎక్కడా తడబడలేదని తెలిపారు. ఆస్ట్రేలియా బలమైన జట్టు కావడం వల్లనే ఇండియా ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని ద్రావిడ్ తెలిపారు. కాగా, కోహ్లి వైఫల్యం వెనుక అతని స్నేహితురాలు అనుష్క శర్మ కారణమని ఆరోపిస్తూ, వీరిద్దరిపై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.