: సింగపూర్ చేరుకున్న చంద్రబాబు... నేటి సాయంత్రం ఆ దేశ ప్రధానితో భేటీ


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం సింగపూర్ చేరుకున్నారు. తన మంత్రివర్గ సహచరులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులతో గత రాత్రి హైదరాబాదు నుంచి బయలుదేరిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం సింగపూర్ లో ల్యాండయ్యారు. సింగపూర్ మంత్రి షణ్ముగం, చంద్రబాబు బృందానికి మరికాసేపట్లో అల్పాహార విందు ఇవ్వనున్నారు. అనంతరం నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసిన ప్రతినిధి బృందంతో చంద్రబాబు భేటీ అవుతారు. ఈ భేటీలో రాజధాని మాస్టర్ ప్లాన్ కు చంద్రబాబు తుది రూపు ఇస్తారు. నేటి సాయంత్రం సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తో చంద్రబాబు భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News