: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కేంద్రం నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏపీలో స్థానిక సంస్థల నిర్వహణ కోసం రూ. 298.82 కోట్లు, గణాంక వ్యవస్థ నిర్వహణ కోసం రూ.2.6 కోట్లు, ఇతర ప్రాజెక్టుల కోసం రూ.50 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం రూ.385 కోట్లు విడుదల చేసింది. ఇక తెలంగాణకు రూ.150 కోట్లు విడుదలయ్యాయి. 13వ ఆర్థిక సంఘంలో పేర్కొన్న సిఫార్సుల మేరకు తాజా నిధులు విడుదలయ్యాయి.