: ఇక విమానాలు, ఆర్టీసీ బస్సుల్లో 'వైఫై' సౌకర్యం!


విమాన ప్రయాణం, బస్సు ప్రయాణం బోరు కొడుతోందా? ఏప్రిల్‌ 1 నుంచి బస్సుల్లో, సమీప భవిష్యత్తులో విమానాల్లోనూ వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఇంద్ర, గరుడ, వెన్నెల సర్వీస్‌ బస్సుల్లో తొలి గంట పాటు ఉచితంగా సేవలు అందిస్తామని, ఆపై కేవలం 10 రూపాయలు చెల్లించి 'వైఫై' సౌకర్యం పొందవచ్చని, ఆర్టీసీ స్పష్టం చేసింది. హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో ఈ సౌకరాన్ని తొలుత కల్పించాలని బస్‌ భవన్‌ వర్గాలు తెలిపాయి. ఇక విమానాల విషయానికి వస్తే, 'వైఫై' సౌకర్యం కల్పించడంపై భారత విమానయాన శాఖ దృష్టిని సారించింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ప్రస్తుతం భారత్‌ లో విదేశీ విమానయాన సంస్థలైన ఎమిరేట్స్‌, లుఫ్తాన్సా, టర్కీ ఎయిర్‌ లైన్స్‌ మాత్రమే ప్రయాణంలో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

  • Loading...

More Telugu News