: ఒక పక్క ఎన్నికలు... మరోపక్క ఆరోపణలు... మధ్యవర్తిత్వం చేస్తానన్న బాలకృష్ణ


హైదరాబాదులోని ఫిలించాంబర్ కార్యాలయం వేడెక్కింది. ఒక వైపు ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు పోటీలో ఉన్న వారి మధ్య ఆరోపణల స్థాయి తీవ్రమైంది. నటి హేమ, శివాజీ రాజాల మధ్య ఆరోపణలు మరో అడుగు ముందుకు వేశాయి. వీరిద్దరూ వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. ఇవి వారిద్దరికీ సంబంధించినవేనని, ప్యానల్ కు సంబంధం లేదని అధ్యక్ష బరిలో ఉన్న జయసుధ అన్నారు. తొలుత మీడియాకు ఎక్కింది ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. కాగా మనసుకు నచ్చిన వారికి ఓటు వేసి గెలిపించాలని, రాజకీయాలు మనకు వద్దని మరో పోటీదారు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. 'మా' సభ్యుల మధ్య గొడవలు పెరగకుండా మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమని హీరో బాలకృష్ణ తెలిపారు. ఓటేసేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, ఈ రాజకీయం ఒక్కరోజు మాత్రమే ఉంటే బాగుంటుందని అన్నారు. ఎవరు గెలిచినా పరిశ్రమకు మేలు కలగాలని కోరుకుంటున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News