: అంత సంస్కారం శివాజీ రాజాకు లేదు: నటి హేమ ఫైర్


తనపై తప్పుడు ఆరోపణలు చేసిన శివాజీ రాజాకు క్షమాపణ చెప్పేంత సంస్కారం ఉందని తాను భావించడం లేదని సినీ నటి హేమ విమర్శించారు. ఈ ఉదయం 'మా' ఎన్నికలు జరుగుతున్న ఫిలింఛాంబర్ కార్యాలయానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. రాజేంద్రప్రసాద్ ప్యానల్ సభ్యుడు, శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించారని హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని దర్శకరత్న దాసరి నారాయణరావుని కలిశానని, ఎన్నికల అనంతరం సమస్య పరిష్కరిద్దామని ఆయన తెలిపారని హేమ వివరించారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినందునే తాను ఆయనను విమర్శించాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, ఉదయం 9 గంటల వరకూ 70 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News