: భారతీయుడిపై దాడి చేసిన ఆమెరికా పోలీసు అధికారికి పదేళ్ల జైలుశిక్ష?


తన మనవడిని చూసుకోవడం కోసం అమెరికా వెళ్లి, ఉత్తపుణ్యానికి పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న సురేష్‌ భాయ్ పటేల్ (57) కేసు 'ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ' విచారణకు వచ్చింది. పటేల్ పై అక్కడి పోలీసు అధికారి ఎరిక్ పార్కర్ (26) అమానుషంగా దాడి చేయగా, పాక్షిక పక్షవాతం బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో అమెరికా పోలీస్ అధికారికి పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్టు స్థానిక న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. సామాన్యులకు భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారి క్రూరంగా ప్రవర్తించాడని కోర్ట్ తప్పుపట్టింది. మనుషుల వర్ణాన్ని బట్టి వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం తీవ్రమైన నేరం అని పేర్కొంటూ, ఏప్రిల్ నెలలో శిక్షను ఖరారు చేస్తామని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటేల్ చేతి కర్రల సాయంతో నడుస్తున్నారు. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో అలబామా రాష్ట్ర గవర్నర్ రాబర్ట్ బెంట్లే భారత్‌ కు, పటేల్ కుటుంబానికి క్షమాపణలు తెలిపిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News