: ఈ 'బంగారు' చేప పొట్ట ఖరీదే రూ. 85 వేలు!


సాధారణంగా ఎంత పెద్ద చేప అయినా వందల్లో రేటు పలుకుతుంది. మరీ అరుదుగా దొరికే చేపలైతే వేలల్లో ధర పలుకుతాయి. కానీ బంగారు వర్ణంలో ఉండి అత్యంత అరుదైన మగ 'కచిడీ' చేప దొరికితే, ఆ మత్స్యకారుడికి బంగారం దొరికినట్టే. ఎందుకంటే దీని ఖరీదు లక్ష రూపాయలు కాబట్టి. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం పల్లిపాలెం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు శనివారం చిక్కింది మగ కచిడీ. దీని పొట్ట భాగాన్ని బలానికి వాడే మందుల్లో ఉపయోగిస్తారని, పొట్ట భాగం ధర రూ. 85 వేల వరకూ ఉంటుందని చేపల వేటగాళ్ళు అంటున్నారు. కాగా, ఈ చేపను నర్సాపురానికి చెందిన ఒక వ్యాపారి లక్ష రూపాయలకు కొనుక్కున్నాడు.

  • Loading...

More Telugu News