: బాంబులతో దద్దరిల్లుతున్న సనా, ఆడెన్
సౌదీ అరేబియా నేతృత్వంలో సంకీర్ణ సైన్యం హుతి తిరుగుబాటుదారులపై చేస్తున్న దాడులతో యెమెన్ వణికిపోతోంది. రాజధాని సనా, ఆడెన్ నగరాలపై సౌదీ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఆడెన్ నగరం నుంచి దౌత్య అధికారులను సౌదీ నావికా దళం ఖాళీ చేయించి, వారిని సౌదీలోని జెడ్డా నౌకాశ్రయానికి సురక్షితంగా చేర్చినట్లు ఆ దేశం ప్రకటించింది. సౌదీ ఆధ్వర్యంలో చేపడుతున్న సైనిక చర్యలకు తాము మద్దతు ప్రకటిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపారు. ఈ మేరకు ఆయన సౌదీ రాజు సల్మాన్ కు ఫోన్ చేసి మాట్లాడారు.