: నెంబర్ వన్ ర్యాంకు తెచ్చిన ఉత్సాహం... జపాన్ అమ్మాయిపై సైనా ఘనవిజయం


భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండో సెమీఫైనల్లో జపాన్ షట్లర్ యు హషిమొటోపై 21-15, 21-11తో అలవోకగా నెగ్గింది. టైటిల్ కోసం సైనా థాయ్ లాండ్ క్రీడాకారిణి ఇలనాన్ రచనోతో తలపడనుంది. అంతకుముందు, తొలి సెమీఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ పై రచనో విజయం సాధించి ఫైనల్ చేరింది. కరోలినా ఓటమితో సైనాకు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు లభించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News