: చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్
హైదరాబాదీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు సాధించిన తొలి భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. ఇంతకుముందు, పురుషుల్లో ప్రకాశ్ పదుకొనే మాత్రమే నెంబర్ వన్ పీఠం అధిష్ఠించగలిగాడు. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్ లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ ఓటమిపాలవడంతో అగ్రపీఠం సైనా పరమైంది. ఈ టోర్నీలో సైనా జపాన్ క్రీడాకారిణి యు హషిమొటోతో ఆడాల్సి ఉన్నా, ఈ మ్యాచ్ తో పనిలేకుండానే నెంబర్ వన్ ర్యాంకు కైవసం అయింది.