: బ్యాంకు మేనేజర్, సెక్రటరీ, ట్రెజరర్, ఏజెంట్... అందరూ బెగ్గర్లే!
బీహార్ లోని గయ పట్టణంలో బెగ్గర్లు తమ కోసం ఏకంగా ఓ బ్యాంకునే ఏర్పాటు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కష్టకాలంలో ఆర్థిక భద్రత కల్పించుకోవడమే ఈ బ్యాంకు ఏర్పాటు వెనకున్న ప్రధాన ఉద్దేశం. గయ పట్టణంలోని 'మా మంగళగౌరి మందిర్' వద్ద భిక్షాటన చేసే వీరు ఇప్పుడు బ్యాంకుకు అధినేతలు. ఈ బ్యాంకు పేరు 'మంగళ బ్యాంకు'. మొత్తం 40 మంది ఇందులో భాగస్వాములు. బ్యాంకు మేనేజర్, ట్రెజరర్, సెక్రటరీ, ఓ ఏజెంట్... ఇలా అందరూ బెగ్గర్లేనని రాజ్ కుమార్ మాంఝి అనే బెగ్గర్ తెలిపాడు. బ్యాంకు సెక్రటరీ మాలతీ దేవి మాట్లాడుతూ, బిక్షగాళ్ల ఆకాంక్షలు నెరవేర్చేందుకు బ్యాంకు పాటుపడుతుందని తెలిపింది. సమాజంలో ఇప్పటికీ తమను గుర్తించడం లేదని వాపోయింది. మాలతీ పెద్ద ఎత్తున బెగ్గర్లతో అకౌంట్లు ఓపెన్ చేయిస్తూ, బ్యాంకు అభ్యున్నతికి పాటుపడుతోంది. కాగా, బెగ్గర్ల బ్యాంకు ఏర్పాటుకు స్థానిక అధికారులు ఎంతగానో ప్రోత్సహించారట.