: రేపు మూడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు శంకుస్థాపన: గంటా
ఆంధ్రప్రదేశ్ లో మూడు అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలకు ఒకేచోట శంకుస్థాపన జరగడం చారిత్రాత్మకమని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తిరుపతిలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలకు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని అన్నారు. ఈ విద్యాసంస్థల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలుంటాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి 255 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని ఆయన తెలిపారు.