: సగానికి పైగా కళాకారులు సమస్యల్లో ఉన్నారు: నరేష్
'మా'లో 700 మందికి పైగా సభ్యులు ఉన్నారని నరేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గతంలో ఫిల్మ్ నగర్ ను, కృష్ణానగర్ ను వేరు చేసే కుట్ర జరిగిందని అన్నారు. ఆ రెండింటి మధ్య ఉన్న అద్దాన్ని తొలగించడమే తమ ప్రధాన లక్ష్యమని నరేష్ అన్నారు. సుమారు 500 మందికి పైగా సభ్యులకు ప్రయోజనం కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. సినీ కళాకారులందరికీ సంక్షేమం అందాలనేది తమ ప్రయత్నమని నరేష్ అన్నారు. 'మా' కొత్త ప్యానల్ విజయం సాధిస్తే గ్రీవెన్సెస్ కోసం ఒక రోజు కేటాయిస్తుందని నరేష్ మాటిచ్చారు. నాగబాబుగారికి 'మా'లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? అనేది కూడా తెలియకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని నరేష్ అన్నారు. 'మా' ఆఫీస్ కోసం 75 లక్షల రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొన్నారు. అదిప్పుడు 20 లక్షల ధరకు కూడా అమ్ముుడుపోవడం లేదని నరేష్ అన్నారు. ప్రస్తుతమున్న ధర ప్రకారం, దానికి నెలకు 45 వేలు అద్దె రావాల్సి ఉంటుందని, అది రావడం లేదని నరేష్ చెప్పారు.